తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దొంగలను తరిమికొట్టిన వృద్ధులకు సాహస పురస్కారం - bravery award

తమిళనాడులో సాయుధ దొంగలతో విరోచితంగా పోరాడిన వృద్ధులను సాహస పురస్కారం వరించింది. తమ ఇంటి ఆవరణలో ప్రవేశించిన ఆగంతుకలను తరిమికొట్టిన షణ్ముగవేల్‌ దంపతులకు సీఎం పళనిస్వామి ఈ అవార్డును అందజేశారు.

దొంగలను తరిమికొట్టిన వృద్ధులకు సాహస పురస్కారం

By

Published : Aug 15, 2019, 4:17 PM IST

Updated : Sep 27, 2019, 2:44 AM IST

తమిళనాడులోని షణ్ముగవేల్ దంపతులకు సాహస పురస్కారం దక్కింది. స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఈ అవార్డును అందజేశారు.

తిరునల్వేలి జిల్లా కడయంలో ఇటీవలే తమ ఇంట్లోకి ఆయుధాలతో దొంగతానికి వచ్చిన ఇద్దరు దొంగలను ధైర్య సాహసాలతో తరిమికొట్టారు వృద్ధ దంపతులు. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లింది. వృద్ధుల సాహసానికి మెచ్చిన ఆయన.. రాష్ట్ర సాహస అవార్డుకు వారి పేర్లను సిఫారసు చేశారు. నేడు సీఎం పురస్కారం అందజేశారు.

అవార్డు దక్కినందుకు ఆనందం వ్యక్తం చేశారు షణ్ముగవేల్​. ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని సూచించారు. తమకు ఎదురైన పరిస్థితి మరెవరికీ రాకూడదన్నారు.

ఇదీ చూడండి: వృద్ధులే కదా అని దొంగతనానికొస్తే.. తరిమేస్తాం!

Last Updated : Sep 27, 2019, 2:44 AM IST

ABOUT THE AUTHOR

...view details