తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ యాత్రపై ఈసీకి తృణమూల్​ ఫిర్యాదు

ప్రధాని నరేంద్ర మోదీ కేదార్​నాథ్​ యాత్రపై ఎన్నికల సంఘానికి తృణమూల్​ కాంగ్రెస్ లేఖ రాసింది. మోదీ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదు చేసింది. మీడియా మోదీకే ప్రాధాన్యమిచ్చిందని, ప్రసారాలు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆరోపించింది టీఎంసీ.

By

Published : May 19, 2019, 1:43 PM IST

మోదీ యాత్రపై ఈసీకి తృణమూల్​ ఫిర్యాదు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేదార్​నాథ్ యాత్ర ఎన్నికల నిబంధనావళిని అతిక్రమించేలా ఉందని తృణమూల్ కాంగ్రెస్​ ఆరోపించింది. ఈ మేరకు ఎన్నికల సంఘాలని లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు పార్టీ అధికార ప్రతినిధి డెరెక్ ఒబ్రెయిన్​.

"సార్వత్రిక ఎన్నికల ప్రచారం మే 17నే ముగిసింది. గత రెండు రోజులుగా మోదీ కేదార్​నాథ్​ యాత్రకే మీడియా అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఇది కచ్చితంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమించడమే. కేదార్​నాథ్ ఆలయ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైనట్లు ప్రధాని తెలిపారు. ప్రజలు, మీడియాతో మాట్లాడారు. మీడియాలో 'మోదీ మోదీ' అనే నినాదాలు వినిపించే దృశ్యాలు ప్రసారమయ్యాయి. ఇది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఓటర్లను ప్రభావితం చేయడమే. ప్రజాస్వామ్యంలో కీలక భూమిక పోషించాల్సిన ఎన్నికల సంఘం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. మోదీ యాత్రకు సంబంధించిన ప్రసారాలు తక్షణమే నిలిపివేసేలా ఈసీ చర్యలు తీసుకోవాలి. "

-ఈసీకి లేఖలో తృణమూల్​ కాంగ్రెస్​

ఇదీ చూడండి: 'సార్వత్రికం' తుది దశ: లైవ్​ అప్​డైట్స్​

ABOUT THE AUTHOR

...view details