తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎమ్మెల్యే సహా 11 మందిని బలిగొన్న తీవ్రవాదులు - మెరుపుదాడి

అరుణాచల్​ప్రదేశ్​లో ఎన్​ఎస్​సీఎన్​ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో సిట్టింగ్​ ఎమ్మెల్యే తిరాంగ్​ అబోహ్​, ఆయన కుమారుడు సహా 11 మంది మరణించారు.

ఎమ్మెల్యే సహా 11 మందిని బలిగొన్న తీవ్రవాదులు

By

Published : May 21, 2019, 6:38 PM IST

Updated : May 21, 2019, 8:54 PM IST

ఎమ్మెల్యే సహా 11 మందిని బలిగొన్న తీవ్రవాదులు

అరుణాచల్​ప్రదేశ్ సిట్టింగ్​ ఎమ్మెల్యే తిరాంగ్ అబోహ్​ను ఎన్​ఎస్​సీఎన్​ (ఐఎమ్) ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దాడిలో తిరాంగ్​, ఆయన కుమారుడు సహా మొత్తం 11 మంది మరణించారు.

ఎమ్మెల్యే వాహనశ్రేణి అసోం నుంచి అరుణాచల్​ ప్రదేశ్​లోని ఖోన్సాకు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అరుణాచల్​ప్రదేశ్​ టిరాప్​ జిల్లా బొగాపాని గ్రామం వద్ద ఉదయం 11 గంటల సమయంలో ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తిరాంగ్​ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

అరుణాచల్​ప్రదేశ్​ ఖోన్సా పశ్చిమ నియోజకవర్గం నుంచి 2014లో పీపుల్స్​ పార్టీ ఆఫ్ అరుణాచల్​-పీపీఏ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తిరాంగ్​. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఎన్​పీపీ టికెట్​పై గెలిచారు.

ప్రముఖుల దిగ్భ్రాంతి...

ఉగ్రదాడిని ఎన్​పీపీ అధ్యక్షుడు, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్​ సంగ్మా తీవ్రంగా ఖండించారు. ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్.. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

తిరాంగ్​ హత్యపై అరుణాచల్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రి పెమా ఖండూ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దోషుల్ని విడిచిపెట్టబోమని తేల్చిచెప్పారు.

తిరాంగ్​ హత్యను కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఖండించారు. ఈ దుశ్చర్యను ఈశాన్య భారతంలో శాంతికి విఘాతం కలిగించేందుకు జరిగిన ప్రయత్నంగా అభివర్ణించారు.

ఇదీ చూడండి: దిల్లీలో ఎన్డీఏ ముఖ్యనేతల సమావేశం

Last Updated : May 21, 2019, 8:54 PM IST

ABOUT THE AUTHOR

...view details