బిహార్ అసెంబ్లీ చివరి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా కతిహార్‌లో పర్యటించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్డీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఓటు వేసి చేసిన పొరపాటును సరిదిద్దుకునే సమయం వచ్చిందని అక్కడి ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
'ఛత్తీస్‌గఢ్ రైతులకు క్వింటాల్ వరి ధాన్యానికి రూ.2,500 ఇస్తుంటే.. ఇక్కడ మీకు రూ.700 మాత్రమే దక్కుతున్నాయి. మీరు చేసిన తప్పు.. నితీశ్‌జీ, మోదీజీకి ఓటు వేయడం. ఆ తప్పును దిద్దుకునే సమయం ఆసన్నమైంది' అంటూ రాహుల్ గాంధీ పరోక్షంగా మహాగట్ బంధన్‌కు ఓటు వేయమని ప్రజలను కోరారు.