తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో అలజడి: ఆరుగురు ఉగ్రవాదుల హతం - కశ్మీర్​లో ఎన్​కౌంటర్​

జమ్ము కశ్మీర్​లో రాంబన్​ జిల్లాలో ఓ ఇంట్లో నక్కిన ఐదుగురు ఉగ్రవాదుల్లో ముగ్గురిని మట్టుబెట్టాయి బలగాలు. ఇందులో మోస్ట్​ వాంటెడ్​ హిజ్బుల్​ ముజాహిదీన్​ క్రిమినల్​ ఉన్నాడు. ఈ ఒక్కరోజే మూడు వేర్వేరు ఘటనలో మొత్తం ఆరుగురు తీవ్రవాదులు హతమయ్యారు. ఒక జవాను సైతం ప్రాణాలు కోల్పోయాడు.

Three ultras eliminated, one Army jawan killed in ongoing operation in J-K's Ramban

By

Published : Sep 28, 2019, 5:23 PM IST

Updated : Oct 2, 2019, 9:03 AM IST

ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2 నెలలుగా ఆంక్షల నడుమ ఉన్న జమ్ము కశ్మీర్​లో తొలిసారి ఉగ్రకలకలం రేగింది. ఒక్కరోజే మూడు వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు అలజడి సృష్టించారు. శ్రీనగర్​లో సైనిక వాహన శ్రేణిపై గ్రనేడ్​ దాడికి పాల్పడ్డారు. మరో రెండు చోట్ల ఎదురుకాల్పులు జరిగాయి.

రాంబన్​లో ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు.

రాంబన్​ జిల్లా బటోట్​లో ఓ ప్రయాణికుల బస్సును అడ్డుకునేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. డ్రైవర్​ చాకచక్యంతో.. బస్సుకు ముప్పు తప్పగా భద్రతాదళాల అప్రమత్తతతో పారిపోయిన అయిదుగురు ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాగి, అక్కడి వారిని బందీలుగా చేసుకున్నారు. అనంతరం బలగాలపైకి కాల్పులకు పాల్పడ్డారు. దీటుగా బదులిచ్చిన భద్రతా దళాలు ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి. ఇందులో హిజ్బుల్​ ముజాహిదీన్​కు చెందిన కీలక ఉగ్రవాది హతమయ్యాడు. బందీలుగా ఉన్న వారిని కాపాడాయి. ఈ ఘటనలో ఒక జవాను మృతి చెందాడు. ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

గందెర్బాల్​లో ముగ్గురు హతం

జమ్ముకశ్మీర్​ గందెర్బాల్​ జిల్లా త్రుమ్​ఖాల్​ ప్రాంతంలో భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులను అంతమొందించాయి బలగాలు.

రాంబన్​లో ఎన్​కౌంటర్​

శ్రీనగర్​లోనూ సైనిక వాహన శ్రేణిపై గ్రనేడ్‌దాడికి ప్రయత్నించారు ఉగ్రవాదులు. ఈ ఘటన నుంచి సైనికులు త్రుటిలో తప్పించుకున్నారు.

Last Updated : Oct 2, 2019, 9:03 AM IST

ABOUT THE AUTHOR

...view details