తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వరద బాధితులకు సాయం కోసం వెళ్లి ముగ్గురు మృతి - హెలికాఫ్టర్​ కుప్పకూలింది

వరద బాధితులకు నిత్యావసరాలు అందించడానికి వెళ్లిన హెలికాఫ్టర్​ కుప్పకూలింది. ఈ ఘటన ఉత్తరాఖండ్​లోని ఉత్తరకాశీ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాదంలో పైలట్​తో పాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

వరద బాధితులకు సాయం కోసం వెళ్లి ముగ్గురు మృతి

By

Published : Aug 21, 2019, 3:23 PM IST

Updated : Sep 27, 2019, 7:00 PM IST

వరద బాధితులకు సాయం కోసం వెళ్లి ముగ్గురు మృతి

ఉత్తరాఖండ్​లోని ఉత్తరకాశీ జిల్లాలో హెలికాఫ్టర్​ కుప్పకూలింది. వరద ప్రభావిత ప్రాంతాలకు నిత్యావసరాలు అందించి వెనుదిరుగుతుండగా మోల్డీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలట్​, సహపైలట్​తో పాటు మరొకరు మృతి చెందారు.

ఈ ప్రైవేట్​ హెలికాఫ్టర్..​ హెరిటేజ్​ ఏవియేషన్​ సంస్థకు చెందింది.

హెలికాఫ్టర్​ ప్రమాదంపై ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు 15 లక్షల ఎక్సగ్రేషియా ప్రకటించారు.
ఉత్తరాఖండ్​ను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదలకు ఉత్తరకాశీ జిల్లా విలవిలలాడుతోంది. అకాల వర్షాలకు మోరీ ప్రాంతంలో 16 మంది మృతిచెందారు.

ఇదీ చూడండి:- దిల్లీలో రెచ్చిపోయిన దుండగులు... నడిరోడ్డుపైనే చోరీ!

Last Updated : Sep 27, 2019, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details