తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈశాన్య రాష్ట్రాలను కుదిపేసిన భూకంపాలు - NE states

అరుణాచల్​ ప్రదేశ్​లో నిమిషాల వ్యవధిలో 5.6, 3.8, 4.9 తీవ్రతలతో భూకంపాలు సంభవించాయి. దీని ప్రభావంతో అసోం, నాగాలాండ్​లలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు ఏర్పడ్డాయి.

అరుణాచల్​ప్రదేశ్​లో వరుస భూకంపాలు

By

Published : Jul 19, 2019, 7:59 PM IST

అరుణాచల్​ప్రదేశ్​లో వరుస భూకంపాలు

ఈశాన్య రాష్ట్రాలను వరుస భూకంపాలు కుదిపేశాయి. అరుణాచల్​ ప్రదేశ్​లో నిమిషాల వ్యవధిలో 3 సార్లు భూమి కంపించింది. ఈ ప్రకంపనలు భూకంప లేఖినిపై 5.6, 3.8, 4.9గా నమోదయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.

మొదటిసారి మధ్యాహ్నం 2.52 గంటలకు 5.6 తీవ్రతతో కంపించినప్పుడు తూర్పు కమెంగ్​ జిల్లాలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావానికి ఇటానగర్​, అసోంలోని గువాహటి, నాగాలాండ్​లోని డిమాపుర్​లో స్వల్ప ప్రకంపనలు ఏర్పడ్డాయి.

అనంతరం మధ్యాహ్నం 3.04 గంటలకు 3.8 తీవ్రతతో ఇదే ప్రాంతంలో భూకంపం సంభవించింది. మరోసారి మధ్యాహ్నం 3.21 గంటలకు 4.9 తీవ్రతతో కురుంగ్​ కుమే జిల్లాలో 95 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడింది.

ఇదీ చూడండి: బిహార్​: పిడుగుపాటుకు ఏడుగురు చిన్నారుల మృతి

ABOUT THE AUTHOR

...view details