జమ్ము కశ్మీర్ విషయంలో ఇప్పటికే భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతోన్న పాకిస్థాన్ బెదిరింపులకు పాల్పడుతోంది. జమ్ముకశ్మీర్ నుంచి భారత్ తమ బలగాలను ఉపసంహరించుకోవాలని కేరళలోని కొల్లం కలెక్టరేట్‌కు వాట్సాప్‌లో సందేశం వచ్చింది. సందేశం పంపిన నంబరు పాకిస్థాన్‌కు చెందినదిగా గుర్తించారు అధికారులు.
"జమ్ము కశ్మీర్లో భారత బలగాల ఉపసంహరణతో పాటు సైనిక ప్రధాన కార్యాలయం, ప్రధాని నరేంద్రమోదీ, భాజపా, ఆర్ఎస్ఎస్ సభ్యులపై నిఘా పెట్టినట్లు ఆ సందేశంలో ఉంది."