తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ డబ్బులు వేశారు.. రూ. 89 వేలు ఖర్చు చేశాను' - BANK ACCOUNT

ప్రధాని నరేంద్ర మోదీ నెలనెలా తన ఖాతాలోకి డబ్బులు వేస్తున్నారని భావించి హాయిగా వాటిని అవసరాలకు వాడేసుకున్నాడు ఓ మధ్యప్రదేశ్​వాసి. భింద్ జిల్లాలోని రురై గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇప్పటి వరకు రూ.89 వేలు నగదును వినియోగించుకున్నాడు.

'మోదీ డబ్బులు వేశాడు.. 89 వేలు ఖర్చు చేశాను'

By

Published : Nov 23, 2019, 7:48 AM IST

విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని దేశానికి రప్పించి దాన్నంతటినీ సామాన్య ప్రజల ఖాతాలో పడేలా చేస్తానని 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని నమ్మిన ఓ వ్యక్తి తన ఖాతాలోకి నెలనెలా వచ్చి పడుతున్న డబ్బును హాయిగా తీసుకుంటూ అవసరాలకు వాడేసుకున్నాడు. ‘మోదీ ఇచ్చారు.. నేను తీసుకున్నా’ అని చెబుతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్‌ భింద్‌ జిల్లాలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖలో జరిగిందీ ఘటన. రురై గ్రామానికి చెందిన హుకుమ్‌ సింగ్‌, రోని హుకుమ్‌ సింగ్‌.. ఇద్దరూ ఒకే శాఖలో ఖాతాలను తెరిచారు. ఇద్దరు పేర్లు ఒక్కటే అవ్వడం వల్ల ఆ ఇద్దరికీ పొరపాటున ఒకే ఖాతా నంబరు కేటాయించారు. దీంతో ఒక హుకుమ్‌ సింగ్‌ దాచుకుంటున్న నగదు మరో హుకుమ్‌ సింగ్‌ అవసరాలకు ఉపయోగపడ్డాయి.

'మోదీ డబ్బులు వేశారు..రూ. 89 వేలు ఖర్చు చేశాను'

తన ఖాతాలో నగదు జమ అవ్వడం వల్ల అవి ఎక్కడ నుంచి వచ్చాయో తెలియని హుకుమ్‌.. ప్రధాని మోదీ ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నారనుకొని వాటిని వాడుకుంటున్నాడు. అలా ఇప్పటి వరకు ఆరు నెలల కాలంలో దాదాపు రూ.89 వేలు డ్రా చేసుకున్నాడు. మరో హుకుమ్‌ సింగ్‌ తన ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకుందామని ప్రయత్నించగా అందులో రూ.35 వేలు మాత్రమే ఉన్నట్లు గుర్తించాడు.

దీనిపై బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించగా జరిగిన తప్పును కనుగొన్నారు. హుకుమ్‌ను ప్రశ్నించగా ‘ప్రధాని మోదీ నా ఖాతాలో డబ్బులు వేస్తున్నారనుకున్నా. అందుకే వాటిని తీసుకుని వినియోగించా’ అంటూ అమాయకంగా సమాధానం ఇచ్చాడు. దీంతో బ్యాంకు సిబ్బంది అతడి అమాయకత్వానికి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఇద్దరికి ఒకే ఖాతా నంబరు ఎలా వెళ్లిందో ఇప్పటికీ తెలియడం లేదంటూ సిబ్బంది బదులివ్వడం గమనార్హం.

ఇదీ చూడండి:మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్​ ఠాక్రే: పవార్​

ABOUT THE AUTHOR

...view details