తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ కుటుంబంలోని 16 మంది జవాన్లే - belagavi soldiers in border

ఇంట్లో ఒక్కరిద్దరిని సరిహద్దుకు పంపితేనే.. వారక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అనుకుంటూ బిక్కుబిక్కుమని కాలం గడుపుతారు కుటుంబ సభ్యులు. కానీ, కర్ణాటక బెళగావికి చెందిన ఓ కుటుంబం.. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 16 మంది జవాన్లను సరిహద్దుకు పంపినందుకు గర్వంగా భావిస్తున్నారు. అంతే, కాదు, భవిష్యత్తులో ఆ కుటుంబంలోని యువకులందరినీ.. సైనికులను చేయడమే తమ లక్ష్యం అంటున్నారు.

A model family
ఆ కుటుంబంలోని 16 మంది జవాన్లే

By

Published : Jul 6, 2020, 2:19 PM IST

Updated : Jul 6, 2020, 2:44 PM IST

దేశ భక్తి అందరికీ ఉంటుంది. అయితే... ఎంత వరకు? భరతమాతకు హాని కలిగిస్తే.. రొమ్ము విరిచి శత్రువుకు ఎదురెళ్లి.. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా యుద్ధం చేసే సైనికుడవ్వాలని ఎంతమంది అనుకుంటారు? దేశం కోసం ప్రాణాలిచ్చేందుకు ఎన్ని కుటుంబాలు అంగీకరిస్తాయి? కానీ, కర్ణాటక బెళగావికి చెందిన ఓ ఊర్లో.. ఒకే కుటుంబానికి చెందిన 16 మంది సైన్యానికి తమ జీవితాలు అంకితం చేశారు.

కుటుంబమంతా దేశం కోసమే..

సవదత్తి తాలూకా ఇంచాలోని బాగెవాడి గ్రామానికి చెందిన ఓ కటుంబం దేశం కోసమే పుట్టిందనడంలో అతిశయోక్తి లేదు. 160 సభ్యులున్న ఈ ఉమ్మడి కుటుంబంలో 16 మంది భారత సైనికులున్నారు. వారిలో 9 మంది పదవీ విరమణ​ అయ్యారు. మరో ఏడుగురు జమ్ము కశ్మీర్​ సహా.. దేశంలోని పలుచోట్ల సేవలందిస్తున్నారు.

1977లో ఈ కుటుంబానికి చెందిన రుద్రప్ప తొలిసారిగా సైన్యంలో చేరారు. అప్పటి నుంచి వారసులంతా ఆయన బాటలోనే నడిచారు.

ఊరు ఊరంతా జవాన్లే...

ఓ సర్వే ప్రకారం బెళగావి జిల్లాకు చెందిన 50 వేల మంది సైనికులు దేశానికి సేవ చేస్తున్నారు. ఇక ఇంచాల గ్రామంలో దేశభక్తి వెల్లివిరుస్తోంది. 10 వేల మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో దాదాపు 600 మంది జవాన్లున్నారు.

ఇంచాల మఠాధిపతి డాక్టర్​ శివానంద భారతి... 1970లోనే ఓ పాఠశాల ఏర్పాటు చేశారు. ఆ బడిలో చదువుతో పాటు, దేశభక్తి నూరిపోసేవారు. అందుకే, ఇంచాలలోని ప్రతి కుటుంబంలోనూ ఓ సైనికుడో, ప్రభుత్వాధికారో ఉన్నారు.

ఈ గ్రామంలో పదవీ విరమణ పొందిన 200 మంది సైనికులు.. ఓ బృందంగా ఏర్పడి.. గ్రామంలోని ఆసక్తిగల యువకులకు సైనిక శిక్షణ ఇస్తున్నారు. శారీరకంగా, మానసికంగా దేశం కోసం వారిని సిద్ధం చేస్తున్నారు. వారి ప్రోత్సాహంతో ఇక్కడి యువత దేశంపై మరింత ప్రేమను పెంచుకుంటోంది.

ఆ 16 మంది జవాన్లు వీరే...

ఒకే కటుంబంలో 16 మంది జవాన్లు!
ఒకే కటుంబంలో 16 మంది జవాన్లు!
ఒకే కటుంబంలో 16 మంది జవాన్లు!
ఒకే కటుంబంలో 16 మంది జవాన్లు!
ఒకే కటుంబంలో 16 మంది జవాన్లు!
ఒకే కటుంబంలో 16 మంది జవాన్లు!
ఒకే కటుంబంలో 16 మంది జవాన్లు!
ఒకే కటుంబంలో 16 మంది జవాన్లు!
ఒకే కటుంబంలో 16 మంది జవాన్లు!
ఒకే కటుంబంలో 16 మంది జవాన్లు!
ఒకే కటుంబంలో 16 మంది జవాన్లు!
ఒకే కటుంబంలో 16 మంది జవాన్లు!
ఒకే కటుంబంలో 16 మంది జవాన్లు!
ఒకే కటుంబంలో 16 మంది జవాన్లు!
ఒకే కటుంబంలో 16 మంది జవాన్లు!

ఇదీ చదవండి:సహచరుడి చెల్లికి పెళ్లి చేసిన సైనికులు

Last Updated : Jul 6, 2020, 2:44 PM IST

ABOUT THE AUTHOR

...view details