తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ మైకుల్లో పాటలు కాదు.. విద్యార్థులకు పాఠాలు!

కరోనా మహమ్మారి వచ్చి విద్యార్థుల భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చిన వేళ.. అందరూ ఆన్​లైన్​ క్లాసులబాట పట్టారు. కానీ, ఛత్తీస్​గఢ్​ బస్తర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇంటర్నెట్​ సౌకర్యమే లేదు. ఇక ఆ ఊర్లో విద్యార్థుల చదువులు కొనసాగే మార్గమే లేదనుకున్న వేళ.. గ్రామస్థులు ఓ ఆలోచన చేశారు. గ్రామంలో మైకులు పెట్టించి పిల్లలకు పాఠాలు వినిపిస్తున్నారు.

This Chhattisgarh village educate students through loudspeakers amid COVID
మైకులో మారు మోగుతున్న పాఠాలు!

By

Published : Jul 5, 2020, 6:10 AM IST

Updated : Jul 5, 2020, 6:43 AM IST

ఆ మైకుల్లో పాటలు కాదు.. విద్యార్థులకు పాఠాలు!

ఛత్తీస్​గఢ్​, బస్తర్​ జిల్లాలో.. లాక్​డౌన్​ కారణంగా పాఠశాలలు మూతబడ్డాయి. తమ బిడ్డల చదువు ఆగిపోకూడదనే ఆలోచనతో లౌడ్​స్పీకర్లు పెట్టించి.. ఇంటివద్దే పాఠాలు చెప్పిస్తున్నారు భట్​పాల్​ గ్రామస్థులు.

ఆన్​లైన్​ కాదు.. ఆన్​లౌడ్​ స్పీకర్​

ఛత్తీస్​గఢ్​లో ఎన్నో గిరిజన, నక్సల్​ ప్రభావిత ప్రాంతాల్లో.. ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఒక వేళ ఉన్నా.. అటవీ ప్రాంతంలో సరిగ్గా సిగ్నల్​ రాదు. దీంతో అలాంటి ప్రాంతాల్లో విద్యార్థులు ఆన్​లైన్​ క్లాసులకు హాజరుకావడం పెద్ద సవాలుగా మారింది. దీంతో భట్​పాల్ గ్రామస్థులు.. జిల్లా పరిపాలనాధికారుల సహకారంతో ఇలా లౌడ్​ స్పీకర్ క్లాసులు పెట్టించారు.

పాఠాలు చెప్పే స్పీకర్లివే....

గ్రామంలో ఏడు చోట్ల ఏర్పాటు చేసిన లౌడ్​ స్పీకర్లలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు.. సాయంత్రం 4.30 గంటల నుంచి మరో రెండు గంటలు పాఠాలు వినిపిస్తున్నారు ఉపాధ్యాయులు. మాస్టారు పాఠాలు మొదలుపెట్టగానే.. ఇళ్లల్లో నుంచి బయటికి వచ్చి భౌతిక దూరం పాటిస్తూ కూర్చుంటారు విద్యార్థులు. శానిటైజర్లు పూసుకున్న చేతుల్లో పుస్తకాలు పట్టుకుని. మాస్టారు చెప్పిందల్లా రాసేసుకుంటున్నారు.

లౌడ్​ స్పీకర్​ పాఠాలు వింటూ...

కరోనా కాలంలో.. విద్యార్థుల భవిష్యత్తు నిలిపే ఈ ఆలోచనకు.. చుట్టుపక్కల గ్రామస్థులూ ఫిదా అవుతున్నారు. దీంతో, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి లౌడ్​ స్పీకర్​ క్లాసులు పెట్టించే యోచనలో ఉంది ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం.

కరోనా జాగ్రత్తలు పాటిస్తూ.. చదువుకుంటాం..!

ఇదీ చదవండి: మూగజీవి మౌనరోదన.. పేలుడు పదార్థం తిన్న వృషభం

Last Updated : Jul 5, 2020, 6:43 AM IST

ABOUT THE AUTHOR

...view details