తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ కోర్టులో రాకేశ్​ అస్థానాకు ఊరట! - Asthana latest

అవినీతి కేసులో చిక్కుకున్న సీబీఐ మాజీ డైరెక్టర్​ రాకేశ్​ అస్థానాకు ఊరట లభించింది. అస్థానాపై ఉన్న ముడుపుల కేసులో సరైన ఆధారాలు లేనందున.. ఆయనకు నోటీసులు జారీచేయడం కుదరదని దిల్లీ కోర్టు స్పష్టం చేసింది.

There is no proper evidence: Delhi CBI Court said
సీబీఐ కోర్టులో రాకేశ్​ ఆస్థానాకు ఊరట

By

Published : Mar 7, 2020, 11:21 PM IST

Updated : Mar 8, 2020, 7:11 AM IST

కేంద్ర దర్యాప్తు సంస్థ మాజీ డైరెక్టర్ రాకేశ్​ అస్థానాకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట లభించింది. ముడుపుల కేసులో సరైన ఆధారాలు లేనందున.. ఆయనకు నోటీసులు జారీ చేయలేమని దిల్లీ కోర్టు పేర్కొంది.

సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రాన్ని విచారణకు స్వీకరించిన ప్రత్యేక న్యాయమూర్తి సంజీవ్‌ కుమార్‌.. అస్థానా పేరు 12వ కాలమ్​లో పేర్కొన్నందున ఆయన్ను నిందితునిగా పరిగణించలేమని స్పష్టం చేశారు. ముడుపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్‌ విషయంలోనూ జస్టిస్​ సంజీవ్​ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.

వారికి నోటీసులు జారీ..

అయితే.. మధ్యవర్తి మనోజ్‌ ప్రసాద్‌, ఆయన సోదరుడు సోమేశ్వర ప్రసాద్, ఆయన మామ సునీల్ మిట్టల్‌పై విచారణ జరిపేందుకు ఆధారాలు ఉన్నట్లు పేర్కొన్న కోర్టు.. వారికి నోటీసులు జారీచేసింది. వచ్చేనెల 13న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సానా సతీష్‌ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:ఈ నెల 12 నుంచి కాంగ్రెస్​ 'గాంధీ సందేశ్​ యాత్ర'

Last Updated : Mar 8, 2020, 7:11 AM IST

ABOUT THE AUTHOR

...view details