తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్షీణించిన ప్రణబ్​ ఆరోగ్యం: ఆర్మీ ఆసుపత్రి - ex president of india

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

There is a decline in the medical condition of Former President Pranab Mukherjee since yesterday
క్షీణిస్తున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ఆరోగ్యం

By

Published : Aug 31, 2020, 11:08 AM IST

Updated : Aug 31, 2020, 11:49 AM IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని దిల్లీలోని సైనిక ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈమేరకు ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి ఊపిరితుత్తుల ఇన్​ఫెక్షన్‌కు చికిత్స చేస్తున్నట్లు వైద్యులు చెప్పారు. ఆయన ఇంకా కోమాలోనే ఉన్నట్లు తెలిపారు.

మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ఈనెల 10న దాదాకు శస్త్రచికిత్స నిర్వహించారు. అంతకుముందు నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌ అని తేలింది.

ఇదీ చదవండి:ప్రతి రోజూ పళ్లెంలో ఇవి తప్పనిసరిగా ఉండేలా..

Last Updated : Aug 31, 2020, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details