తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విజయ్​ దివస్​: అమర వీరులకు ప్రధాని మోదీ నివాళులు

'విజయ్​ దివస్'​ సందర్భంగా అమర వీరులకు.. ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. 1971లో పాకిస్థాన్​తో జరిగిన యుద్ధంలో భారత్​ విజయం సువర్ణాక్షరాలతో లిఖించదగినదిగా ప్రధాని పేర్కొన్నారు.

The Prime Minister, who cured the war heroes of 1971
1971 నాటి యుద్ధ వీరులకు నివార్పించిన ప్రధాని

By

Published : Dec 16, 2019, 11:57 AM IST

Updated : Dec 16, 2019, 12:18 PM IST

విజయ్​ దివస్​: అమర వీరులకు నివాళులు

'విజయ్‌ దివస్' సందర్భంగా అమర జవానులకు నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. పాకిస్థాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో భారత సైన్యం విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్‌ 16న 'విజయ్ దివస్‌' జరుపుతున్నారు. నాటి విజయం సువర్ణాక్షరాలతో లిఖించదగినదని ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు సైన్యం సాహస పరాక్రమాలను ట్విట్టర్‌ వేదికగా ప్రశంసించారు.

ప్రధాని ట్విట్

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, త్రివిధ దళాధిపతులతో కలిసి దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ సహా... పలువురు సైనికాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:బంగాల్​లో వరుసగా నాలుగో రోజూ 'పౌర' ప్రకంపనలు

Last Updated : Dec 16, 2019, 12:18 PM IST

ABOUT THE AUTHOR

...view details