తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోగిని 5 కిలోమీటర్లు మోసుకెళ్లిన వైద్యుడు - 5 కిలోమీటర్లు

రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు కిలోమీటర్ల కొద్దీ మోసుకెళ్లిన వార్తలు చాలానే విన్నాం. ఇది మాత్రం... 'అంతకుమించి'. వైద్యుడే రోగిని స్వయంగా 5 కిలోమీటర్లు భుజాలపై మోసుకెళ్లి చికిత్స చేశారు.

రోగిని 5 కిలోమీటర్లు మోసుకెళ్లిన వైద్యుడు

By

Published : Sep 17, 2019, 1:13 PM IST

Updated : Sep 30, 2019, 10:43 PM IST

రోగిని 5 కిలోమీటర్లు మోసుకెళ్లిన వైద్యుడు

ఒడిశా మల్కన్​గిరిలో ఓ వైద్యుడు మానవత్వం చాటుకున్నారు. రోగిని 5 కిలోమీటర్లు మోసుకెళ్లి మరీ చికిత్స చేశారు.

కైర్​పుట్​కు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు అంబులెన్స్​కు ఫోన్​ చేశారు. అయితే... సరైన రోడ్డు సదుపాయం లేక వాహనం గ్రామానికి చేరలేకపోయింది. రోగిని అంబులెన్స్ వరకు మోసుకెళ్లడం మినహా మరో మార్గం లేదు. కానీ ఆ పని చేసేందుకు గ్రామస్థులు ఎవరూ ముందుకు రాలేదు.

వైద్యుడు శక్తి ప్రసాద్​ దాస్​... రోగి కోసం స్వయంగా రంగంలోకి దిగారు. డ్రైవర్​ సాయంతో బాధితుడ్ని 5 కిలోమీటర్లు మోసుకుంటూ అంబులెన్స్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆస్పత్రికి చేర్చి, చికిత్స అందించారు.

ఇదీ చూడండి:కర్ణాటకలో కుప్పకూలిన మానవ రహిత విమానం

Last Updated : Sep 30, 2019, 10:43 PM IST

ABOUT THE AUTHOR

...view details