గత మూడురోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి దిల్లీ చిగురుటాకుల వణుకుతోంది. ఎడతెరిపి లేని వానలకు దేశ రాజధాని ప్రాంతం పూర్తిగా స్తంభించింది. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి.
చలికి తోడైన వాన- మూడు రోజులుగా వణుకుతున్న దిల్లీ
ఓ వైపు ఎముకలు కొరికే చలి, మరోవైపు ఎడతెరిపి లేని వాన.. దిల్లీ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల ధాటికి దేశ రాజధాని స్తంభించింది.
చలికి తోడైన వాన- మూడు రోజులుగా వణుకుతున్న దిల్లీ
రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. దట్టమైన మేఘాలు కమ్ముకోవడం వల్ల పట్టపగలే చీకట్లు అలుముకున్నాయి. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. వర్షాలకు తోడు చలి తీవ్రత పెరగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చదవండి:బంగాల్ గడ్డ మీద తృణమూల్‌కు భాజపా 'సవాల్'
Last Updated : Jan 6, 2021, 10:56 AM IST