తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్విజ్​ ఆడు.. 'పద్మ'ను ప్రత్యక్షంగా వీక్షించు

భారత అత్యున్నత పురస్కారాల్లో పద్మ అవార్డులు కూడా ఒకటి. ఈ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు చక్కటి అవకాశం కల్పించింది కేంద్రం. అయితే ఇందులో పాల్గొనడానికి చేయాల్సిందల్లా ఒక్కటే.. ప్రభుత్వం ఏర్పాటు చేసే క్విజ్​ పోటీలో నెగ్గడమే.

By

Published : Mar 9, 2020, 11:31 PM IST

Updated : Mar 9, 2020, 11:38 PM IST

Play Quiz .. Watch the Padma Awards Live!
క్విజ్​ ఆడు.. పద్మ అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించు!

దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రదానోత్సవాన్ని.. ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం చక్కటి అవకాశాన్ని కల్పించింది. పద్మ అవార్డులపై క్విజ్‌ పోటీ నిర్వహించి.. గెలిచినవారికి పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించనుంది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా... ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

పద్మ అవార్డుల విజేతల జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయమని, అలాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారికోసం ఈ పోటీ నిర్వహిస్తున్నామని మోదీ తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేసిన ప్రధాని.. పద్మ క్విజ్‌ లింక్‌నూ జత చేశారు.

20 ప్రశ్నలతో క్విజ్​..

20 ప్రశ్నలుండే ఈ క్విజ్‌లో.. గెలిచిన వారిలో కొంతమందిని ఎంపిక చేసి మార్చి 20న రాష్ట్రపతి భవన్‌లో జరిగే పద్మ అవార్డుల కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు.

ఏటా గణతంత్ర దినోత్సవం రోజున పద్మ అవార్డులను ప్రకటిస్తారు. ఈ ఏడాది 141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించారు.

ఇదీ చదవండి:71వ గణతంత్ర భారతావని... ఎంపికైన పద్మ గ్రహీతలు వీరే

Last Updated : Mar 9, 2020, 11:38 PM IST

ABOUT THE AUTHOR

...view details