విదేశీ పర్వతారోహకుల కోసం గాలింపు ముమ్మరం హిమాలయాల్లోని రెండో ఎత్తయిన పశ్చిమ నందాదేవి పర్వతారోహణకు మే 13న వెళ్లిన 8 మంది విదేశీయులు 26న అదృశ్యమయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి భద్రతా దళాలు. హెలికాఫ్టర్ సాయంతో ఆకాశం నుంచిసోమవారం5 మృతదేహాలను గుర్తించాయి. అవి పర్వతారోహణకు వెళ్లిన విదేశీయులవే అయి ఉంటాయని భావిస్తున్నారు అధికారులు.
మృతదేహాలను వెలికితీసేందుకు పర్వతారోహణలో నిపుణులైన నలుగురు ఐటీబీపీ, ఐదుగురు వాయుసేన సిబ్బందిని రంగంలోకి దింపాయి భద్రతా దళాలు.
ఏమైవుంటారు?
బ్రిటన్కు చెందిన మార్టిన్ మేరన్ నేతృత్వంలో పశ్చిమ నందాదేవి పర్వతారోహణకు 8 మంది విదేశీయులు మే 13న వెళ్లారు. 21 వేల 250 అడుగుల ఎత్తుకు చేరుకునేందుకు కొత్త మార్గాన్ని వెతికే క్రమంలో వారితో బేస్క్యాంప్నకు సంబంధాలు తెగిపోయాయి. వారిపై మంచుచరియలు విరిగిపడి ఉంటాయని భావిస్తున్నారుఅధికారులు.
పర్వతారోహణకు వెళ్లిన బృందంలో నలుగురు బ్రిటన్, ఇద్దరు అమెరికా, ఒక ఆస్ట్రేలియా, ఒకరు భారత అధికారి ఉన్నారు.
ఇదీ చూడండి:జామియా మసీదు ఎదుట భద్రతా దళాలపై రాళ్ల దాడి