కరోనా వైరస్ చికిత్సలో అజిత్రోమైసిన్ ఔషధాన్ని ఇకమీదట ఉపయోగించొద్దని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అది సరిగ్గా ప్రభావం చూపకపోవడమే కారణమని పేర్కొన్నాయి. యాంటీ వైరల్ డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకాన్ని మాత్రం యథావిధిగా కొనసాగించునున్నట్లు తెలిపాయి.
కరోనా చికిత్సలో అజిత్రోమైసిన్ వాడొద్దని కేంద్రం నిర్ణయం!
కరోనాతో ఆరోగ్యం విషమించి ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులకు ఇచ్చే అజిత్రోమైసిన్ ఔషధాన్ని వాడొద్దని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకాన్ని మాత్రం యథావిధిగా కొనసాగించనున్నట్లు వెల్లడించాయి.
కోరనా చికిత్సలో కీలక అజిత్రోమైసిన్ వాడొద్దని కేంద్రం నిర్ణయం!
కరోనా బారినపడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకర స్థాయికి చేరిన రోగులకు అజిత్రోమైసిన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ కాంబినేషన్‌తో చికిత్స అందిస్తారు. అయితే అజిత్రోమైసిన్ అంత ప్రయోజనకరంగా లేదని అధికారులు తెలిపారు. కరోనా చికిత్స నిర్వహణకు కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ సవరించనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.