ఇద్దరు స్నేహితులు కలిసి గుడ్లు తినే పందెం పెట్టుకోగా... అవి తింటూనే వారిలో ఒక వ్యక్తి ప్రాణాలు వీడాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని జాన్‌పూర్ జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది.
ఇద్దరు స్నేహితులు కలిసి గుడ్లు తినే పందెం పెట్టుకోగా... అవి తింటూనే వారిలో ఒక వ్యక్తి ప్రాణాలు వీడాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని జాన్‌పూర్ జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది.
ఇద్దరు స్నేహితుల మధ్య గుడ్లు తినే విషయం చర్చకు వచ్చింది. దీంతో ఒకరికి మించి మరొకరు పోటీపడి గొప్పలకుపోయారు. రూ.2 వేలు పందెం కాసుకున్నారు. 50 గుడ్లు తింటే గెలిచినట్లు అని తీర్మానించుకున్నారు. అనుకున్నట్లే సుభాష్ యాదవ్(42) గుడ్లు తినటం మొదలు పెట్టాడు. అలా ఒకదాని తర్వాత ఒకటి 41 గుడ్లు తినేశాడు. చివరికి 42వ గుడ్డు తింటుండగా ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.
ఇదీ చూడండి : ఆహార శుద్ధితో ఆర్థికానికి జోరు