చలాకీతనంతో ఓ కోతి చిరుత వేట నుంచి తన ప్రాణాలు రక్షించుకుంది. వానరానికి, చిరుతకు మధ్య ఎలాంటి వైరం ఉందో తెలియదు కానీ.. కోతిని చిరుత వెంటాడింది. ప్రాణాలు కాపాడుకునేందుకు కోతి వేగంగా చెట్టు ఎక్కేసింది. హమ్మయ్యా బతికిపోయాం అనుకునేలోపే.. చిరుత కూడా చెట్టు ఎక్కేసింది. చిరుత ఇలా చెట్లు ఎక్కేస్తే ఇంకెలా తప్పించుకుంటారు? కానీ కోతి మాత్రం తప్పించుకుంది.
కోతిని వేటాడిన చిరుత.. తెలివితో వానరం ఎస్కేప్!
ఓ చిరుత ఆకలి తీర్చుకునేందుకు కోతిని వెంటాడింది. వెంటనే ప్రాణాలు దక్కించుకోవాలని వానరం చెట్టు ఎక్కగా.. చిరుత కూడా పైకి వచ్చేసింది. కోతిని పట్టుకునేందుకు చాలా ప్రయత్నాలే చేసింది. కానీ వానరం తెలివితేటలకు వేటలో విఫలమై తిరుగుముఖం పట్టింది చిరుత. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కోతిని వేటాడిన చిరుత.. తెలివితో వానరం ఎస్కేప్!
చెట్టు చిటారు కొమ్మకు చేరి గట్టిగా పట్టుకొని గాలికి అటు ఇటూ ఊగసాగింది. కోతిని కింద పడేయడానికి చిరుత చాలా ప్రయత్నాలే చేసింది. అయినా కోతి పట్టువదల్లేదు. కోతిలా చిరుత కూడా కొమ్మ చివరకు వెళ్లేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆ సాహసం చేస్తే కిందపడి ఎముకలు విరుగతాయి అనుకుందో ఏమో.. చిరుత తన ఆకలిని చంపుకొని చెట్టు దిగేసింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్లో పోస్ట్ చేశారు.