తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​ 'హోదా రద్దు, విభజన'కు పార్లమెంట్​ ఆమోదం - Kashmir

ఆర్టికల్​ 370, 35ఏ రద్దు తీర్మానానికి లోక్​సభ ఆమోదం లభించింది. జమ్ముకశ్మీర్​ రాష్ట్ర విభజన బిల్లుకూ పార్లమెంట్​ ఆమోదముద్ర వేసింది.

కశ్మీర్​ 'హోదా రద్దు, విభజన'కు పార్లమెంట్​ ఆమోదం

By

Published : Aug 6, 2019, 8:04 PM IST

జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్​ 370, 35ఏ రద్దు తీర్మానాలకు సభ ఆమోదం తెలిపింది.

ఆమోదం ఇలా..

ఉదయం సభ ప్రారంభమైన వెంటనే 370, 35ఏ అధికరణల రద్దు తీర్మానం, రాష్ట్ర విభజన, రిజర్వేషన్​ బిల్లులను సభ ముందుంచారు అమిత్​ షా. పలు విపక్షాలు 370 రద్దు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. వీటిపై విపక్షాలకు వివరణ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి. అనంతరం ఓటింగ్ జరిగింది.

ఆర్టికల్​ 370, 35ఏ..

కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్​ 370, 35ఏ రద్దుకు అనుకూలంగా లోక్​సభలో 351 మంది సభ్యులు మద్దతిచ్చారు. 72 మంది వ్యతిరేకంగా ఓటేశారు.

పునర్విభజన బిల్లు..

జమ్ముకశ్మీర్​ను​ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలన్న పునర్విభజన బిల్లుకు 370 మంది ఎంపీలు మద్దతు తెలుపగా.. 70 మంది ఈ బిల్లును వ్యతిరేకించారు.

రిజర్వేషన్​ బిల్లు ఉపసంహరణ

సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ జమ్ముకశ్మీర్ రిజర్వేషన్​ బిల్లుపై మోదీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్​లో​ పేద ప్రజలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లును ఆఖరి నిమిషంలో ఉపసంహరించుకుంది. అనంతరం లోక్​సభ నిరవధిక వాయిదా పడింది.

రాష్ట్రపతి ఆమోదమే తరువాయి

సోమవారమే రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లులు.. నేడు లోక్​సభలోనూ ఆమోదం పొందాయి. రాష్ట్రపతి ఆమోదం తర్వాత చట్టంగా మారనున్నాయి.

రెండు రోజుల్లోనే....

లోక్​సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్న భాజపా.. ఆర్టికల్​ 370 రద్దు తీర్మానం, జమ్ముకశ్మీర్​ పునర్వివిభజన బిల్లులను ఆమోదించుకోవడంలో తిరుగులేని విజయం సాధించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని మోదీ సర్కారు కేవలం రెండు రోజుల్లోనే పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది​.

ABOUT THE AUTHOR

...view details