కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలకు సడలింపులు ఇచ్చింది. అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు చేసి అన్లాక్ 1.0ను సోమవారం (జూన్ 8) నుంచి అమలు చేయనున్నట్లు జూన్ 30న వెల్లడించింది. అన్లాక్ 1.0లో భాగంగా ఆతిథ్య, పర్యటక రంగానికి అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు, ప్రసిద్ధ ఆలయాలు, షాపింగ్ మాల్స్ తెరుచుకోనున్నాయి.
పుదుచ్చెరి, కేరళ, గోవా సహా పలు ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు పర్యటకం, ఆతిథ్య రంగంపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. రెస్టారెంట్లు, బీచ్లు, హోటళ్లను ప్రారంభించాలని ఆయా రాష్ట్రాలు కొద్ది రోజులుగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న క్రమంలో పలు మార్గదర్శకాలతో అనుమతులు ఇచ్చింది. అయితే.. కరోనా విజృంభణ అధికంగా ఉన్న కంటైయిన్మెంట్ జోన్లలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు మూసి ఉంచాలని స్పష్టం చేసింది.
3 వేలకుపైగా చారిత్రక కట్టడాలు..
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పురావస్తు శాఖకు సంబంధించిన 3,691 స్మారక కట్టడాలను పర్యటకుల సందర్శన కోసం జూన్ 8 నుంచి తెరిచేందుకు అనుమతులు జారీ చేసింది సాంస్కృతిక శాఖ. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలని సంబంధిత అధికారులకు సూచించారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్.
దిల్లీలో హోటళ్లకు బ్రేక్..