తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాను విపత్తుగా ప్రకటన- మృతుల కుటుంబాలకు పరిహారం

ప్రాణాంతక కరోనా వైరస్​ను విపత్తుగా గుర్తించాలని కేంద్రం నిర్ణయింది. వైరస్ కారణంగా మృతి చెందిన వారి కుటంబానికి ఆర్థిక సాయంగా రూ. 4 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కరోనా గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.

corona latest news
కరోనా మృతులకు రూ.4లక్షల పరిహారం

By

Published : Mar 14, 2020, 5:19 PM IST

కరోనా వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ రూ.4 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ను 'విపత్తు'గా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైరస్‌ వల్ల మరణించిన వారి కుటుంబాలను రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) ద్వారా ఆర్థికంగా ఆదుకోనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో పాటు ఆసుపత్రుల్లో అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వం భరించనుంది.

దేశంలో కరోనా కేసుల సంఖ్య 85కు చేరింది. ఇప్పటికే ఈ వైరస్‌ బారిన పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మోదీ సూచనలు..

కరోనా నియంత్రణకు పాటించాల్సిన జాగ్రత్తలను కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిని జత చేస్తూ ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ముఖ్యమైన విషయాన్ని అందరూ చదవాలని సూచించారు.

  • ఇంట్లో ఉండేవారు సాధ్యమైనంత వరకు ఏకాంత గదిలో ఉండాలి.
  • వెంటిలేషన్​ ఉండేలా చూసుకోవాలి.
  • పెద్దలు, పిల్లలు, గర్భిణీలకు దూరంగా ఉండండి.
  • మీ గదిలోకి వేరే వారు వస్తే కనీసం ఒక మీటర్​ దూరం పాటించండి.

ఇంట్లో ఉండటం ద్వారా కరోనా వైరస్​ బారిన పడకుండా ఉండవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

ఇదీ చూడండి: మాస్కుల లోటు తీర్చేందుకు కేరళ ముందడుగు

ABOUT THE AUTHOR

...view details