తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశం కోసం సొంత వస్తువులు అమ్మిన మహాత్ముడు - sold his own

స్వాతంత్ర్య సంగ్రామంలో మహాత్ముడు చేసిన పోరాటం.. జాతి జనులందరికీ తెలుసు. అహింస అనే ఆయుధంతో.. జనంలో జాతీయతను పాదుకొల్పుతూ... ఆయన స్వాతంత్ర్య పోరాటాన్ని నడిపించిన తీరును ప్రపంచమంతా కొనియాడింది. అయితే స్వాతంత్ర్య పోరాటానికి నిధులు సమకూర్చడం కోసం గాంధీజీ స్వయంగా తన వస్తువులను వేలం వేశారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆ వస్తువులు ఎక్కడున్నాయో తెలుసా..?

దేశం కోసం సొంత వస్తువులు అమ్మిన మహాత్ముడు

By

Published : Aug 16, 2019, 7:01 AM IST

Updated : Sep 27, 2019, 3:46 AM IST

దేశం కోసం సొంత వస్తువులు అమ్మిన మహాత్ముడు

గాంధీ అనగానే.. శాంతి, అహింస, స్వదేశీ, ఛరకా, స్వాతంత్ర్య పోరాటం.. ఇవి ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకుంటారు. స్వాతంత్ర్య పోరాటాన్ని నడిపించడం కోసం.. దేశవ్యాప్తంగా కాలినడకన తిరుగుతూ జోలెపట్టి నిధులు వసూలు చేసిన సంగతినీ అందరూ తలచుకుంటారు. కానీ మహాత్ముడు స్వాతంత్ర్య పోరాటానికి నిధులు సమకూర్చడం కోసం స్వయంగా తన వస్తువులను వేలం వేశారని తెలుసా?

ఉత్తరాఖండ్​ అల్మోరా వాసి జవహర్ షా... గాంధీజీ వాడిన వెండి చెంబును వేలంలో సొంతం చేసుకున్నారు. ఆ రోజుల్లో ఇందుకోసం 11 రూపాయలు వెచ్చించారు. ఆ వెండి చెంబు చేసే విలువ కంటే.. ఇది చాలా పెద్ద మొత్తమేనట. ఈ విషయాన్ని జవహర్ షా కుమారుడు షావల్ షా వెల్లడించారు.

"అల్మోరాలో గాంధీ బహిరంగ సభ నిర్వహించారు. అక్కడ ఆయన నుంచి చెంబును మా నాన్న కొన్నారు. అప్పుడు ఆ చెంబు వెల రూ.11. ఇప్పటి ధర చెప్పలేను కానీ అప్పుడు మాత్రం చాలా ఎక్కువ ధర చెల్లించినట్టే. ఇంట్లో, గుడిలో ఎప్పుడు పూజలు చేసినా ఈ చెంబుతోనే శివుడ్ని అభిషేకిస్తాము. మేము నిద్రపోయేటప్పుడు దగ్గర్లోనే పెట్టుకుంటాం. ఈ చెంబును చాలా జాగ్రత్తగా చూసుకోమని మా నాన్న ఆఖరి క్షణం వరకు చెప్పేవారు.
-షావల్​ షా, జవహర్​ షా కుమారుడు

గాంధీజీ 1929లో అల్మోరాలో పర్యటించారు. అప్పట్లో వివిధ బహిరంగసభల్లో పాల్గొన్నారు. అప్పుడు జవహర్​ షా, ఆయన స్నేహితులు స్వాతంత్ర్య సంగ్రామం కోసం నిధుల సేకరణలో గాంధీకి తోడ్పడ్డారు.

"జవహర్​ షాకు గాంధీ ఒక చెంబు ఇచ్చారని మేమూ విన్నాం. అల్మోరాకు వచ్చినప్పుడు గాంధీ ఓ సభలో ప్రసంగించారు. ఈ చెంబు గాంధీనే ఇచ్చారని షావల్​ షా తండ్రి చెప్పేవారు."
-వీడీఎస్​ నేగి, చరిత్రకారుడు

1929లో నైనిటాల్​కు చెందిన కొందరు మహిళలు... స్వాతంత్ర్య సంగ్రామం కోసం గాంధీకి తమ ఆభరణాలు ఇచ్చారని నేగి చెప్పారు.

"ఇక్కడి ప్రజలు చైతన్యవంతులు. గాంధీ వచ్చినప్పుడు స్వాతంత్ర్య సంగ్రామం కోసం వీరు తమ వంతు సాయం అందించారని మా రికార్డులు చెబుతున్నాయి."
-వీడీఎస్​ నేగి, చరిత్రకారుడు

ఇదీ చూడండి:40 కిలోల కళ్లజోడుతో స్వచ్ఛతా సందేశం

Last Updated : Sep 27, 2019, 3:46 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details