నిర్భయ నిందితుల్లో ఒకడైన అక్షయ్‌కుమార్ సింగ్ తనకు విధించిన మరణశిక్షపై పునఃసమీక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన వేళ మరోసారి ఉరిశిక్ష అమలుపై చర్చ మొదలైంది. 21వ శతాబ్దంలో మరణదండనలకు స్థానం లేదంటూ ఇప్పటికే ఐక్యరాజ్యసమితి ప్రకటన చేయగా దాదాపు 146 దేశాలు మరణశిక్షను రద్దు చేశాయి.
భారత్, పాకిస్థాన్, అప్గానిస్థాన్, అమెరికా సహా 50 దేశాలు ఇప్పటికీ మరణదండనను అమలు చేస్తూనే ఉన్నాయి. అమెరికా ఈ ఏడాదిలో ఇప్పటికే హేయమైన ఘోరాలకు పాల్పడ్డ 22 మందికి మరణశిక్ష అమలు చేసింది. భారత్‌లో 1991 నుంచి ఇప్పటి వరకు 26 మందికి ఉరిశిక్ష అమలు చేయగా నిర్భయ తరహా ఘటనలు, భారత సార్వభౌమత్వంపై దాడులు, భీకరదాడులకు పాల్పడిన వారికి మాత్రమే ఉరిశిక్షలు వేస్తున్నారు.