తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళ ఆర్‌జీసీబీకి గోల్వాల్కర్‌ పేరు : కేంద్రం

కేరళలోని రాజీవ్​గాంధీ సెంటర్​ ఫర్​ బయోటెక్నాలజీ (ఆర్​జీసీబీ) రెండో ప్రాంగణానికి దివంగత ఆరెస్సెస్​ సిద్ధాంతకర్త ఎం.ఎస్​ గోల్వాల్కర్​ పేరు పెట్టాలని నిర్ణయించింది కేంద్రం. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి అధికార వామపక్ష, ప్రతిపక్ష కాంగ్రెస్​ పార్టీలు.

RGCB in Kerala
కేరళ ఆర్‌జీసీబీకి గోల్వాల్కర్‌ పేరు : కేంద్రం

By

Published : Dec 6, 2020, 10:51 AM IST

కేరళలోని రాజీవ్‌గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ(ఆర్‌జీసీబీ) రెండో ప్రాంగణానికి దివంగత ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్త ఎం.ఎస్‌ గోల్వాల్కర్‌ పేరు పెట్టాలన్న కేంద్రం నిర్ణయాన్ని అధికార వామపక్ష, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలు శనివారం తీవ్రంగా విమర్శించాయి. ప్రతి విషయాన్ని భారతీయ జనతా పార్టీ మతపరం చేస్తోందని ఆరోపించాయి. విజ్ఞానశాస్త్రానికి గోల్వాల్కర్‌ ఏం చేశారని ప్రశ్నించాయి.

ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్ధన్‌కు లేఖ రాశారు. ఆర్‌జీసీబీకి గోల్వాల్కర్‌ పేరు పెట్టాలన్న నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు. బదులుగా అంతర్జాతీయ వ్యాప్తంగా ఖ్యాతి పొందిన ప్రముఖ భారతీయ శాస్త్రవేత్తల పేరును పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఆర్‌జీసీబీ రాజకీయాలకు అతీతమని లేఖలో పేర్కొన్నారు.

కేంద్రం నిర్ణయాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ వరుస ట్వీట్లు చేశారు.

ఇదీ చూడండి: 'విజయవంతమైన టీకాలు అందించిన చరిత్ర మనది'

ABOUT THE AUTHOR

...view details