కొద్ది రోజుల క్రితం కథ ఇది. పూరీ జగన్నాథుడి రథోత్సవం జరుగుతోంది.... అదే సమయంలో ఒక వ్యక్తి జంధ్యం వేసుకొని పంచెకట్టుకొని హడావుడిగా వెళుతున్నాడు.. అతని పర్సనాలిటీ అక్కడ ఉన్నవారిని చూపు తిప్పుకోనివ్వలేదు. ఎంతో అకుంఠిత దీక్షతో కష్టపడితేగానీ గ్రీకు శిల్పం వంటి ఆ దేహదారుఢ్యం సొంతం కాదు. అంతే చాలా కెమెరాలు అతడ్ని క్లిక్‌మనిపించాయి.
అక్కడకు సీన్ కట్ చేస్తే.. ఆ ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. కండలు తిరిగిన ఈ అయ్యగారు ఎవరా? ఎవరీ పూజారి బాహుబాలి ? అని నెటిజన్లు గూగుల్ తల్లిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. సమాధానం విని ఆశ్చర్యపోయారు. ఆయన పూరీ జగన్నాథ ఆలయ పూజారి కుమారుడు. ప్రస్తుతం ఆలయంలో సేవలు చేస్తున్న వ్యక్తి. అంతకు మించి పక్కా శాకాహారి..! అతని పేరు అనిల్ గొచికర్. 'మిస్టర్ ఇంటర్నేషనల్ ఇండియా' బంగారు పతక విజేత.
నమ్మక తప్పని నిజం...