కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలపై పంజాబ్, హరియాణా సహా దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కేంద్రం, రైతుల మధ్య చర్చలు జరగలేదు. రైతుల నిరసనలపై కేంద్ర నిర్లక్ష్యం వహిస్తుందని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కేంద్రంపై విమర్శలు చేశారు. అన్నదాతల ఉద్యమానికి పూర్తి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.
ఓట్లు అడిగినప్పుడు లేదా?
ఎన్నికలు వస్తే రైతుల దగ్గరకు నేరుగా వెళ్లి ఓట్లు అడుగుతారు. మరి ఇప్పుడు పెద్ద ఎత్తున రైతులు నిరసన చేస్తుంటే ఎందుకు వెళ్లి చర్చించడం లేదు. దిల్లీలో నిరసన చేస్తోన్న అన్నదాతలు ఏమైనా పాకిస్థాన్ నుంచి వచ్చారా?
- అన్నా హజారే, సామాజిక ఉద్యమకారుడు