ఉగ్రవాదం ఒక క్యాన్సర్ అని పేర్కొన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్. మానవాళిపై మహమ్మారి రోగం ఏవిధంగా విరుచుకుపడుతుందో.. అదే విధంగా తీవ్రవాదం అనే క్యాన్సర్ ప్రతిఒక్కరిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.
ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (టీఈఆర్ఐ)లో ప్రసంగించిన సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యనించారు జైశంకర్.
" ఏదైనా సంఘటన జరిగి నష్టం వాటిల్లిన తర్వాత మాత్రమే ఉగ్రవాదం, మహమ్మారులపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. ఉగ్రవాదులను తయారు చేసే దేశాలు కూడా (పాక్‌ను ఉద్దేశిస్తూ) తమను తాము ఉగ్రవాద బాధితులుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాయి. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటం, ఆ పోరుకు సాయం చేయటం, ప్రోత్సహించటం.. ఉవ్రవాద నిర్మూలనలో పురోగతిని సూచిస్తుంది."