మహమ్మారి కరోనా వైరస్పైనే ప్రభుత్వాలన్నీ దృష్టి పెట్టాయి. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు లాక్డౌన్ సహా అన్ని చర్యలు చేపట్టాయి. వైద్య సదుపాయాల్లోనూ కరోనాపై పోరుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అయితే లాక్డౌన్తో ఎన్ని ప్రాణాలు కాపాడినా.. క్షయ, కలరాతో కలిగే మరణాలు ఆ ప్రాణనష్టాన్ని సమం చేస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
క్షయ, పౌష్టికాహార లోపం, కలరాతో పొంచి ఉన్న ప్రాణ ముప్పును కూడా గుర్తించాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్- హైదరాబాద్)లోని ప్రొఫెసర్ వీ. రమణ సూచించారు. లాక్డౌన్తో వాటిని నిర్లక్ష్యం చేస్తున్నామన్నారు.