కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కెఫే కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ అదృశ్యంపై ఆదాయపు పన్ను శాఖ స్పందించింది. అదృశ్యం తర్వాత దొరికిన లేఖలో ఐటీ అధికారుల వేధింపులపై సిద్ధార్థ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారమే దర్యాప్తు చేశామని అధికార వర్గాలు తెలిపాయి.
"సిద్ధార్థ విషయంలో చట్ట ప్రకారమే దర్యాప్తు చేశాం. ఐటీ చట్టం నిబంధనల ప్రకారమే శాఖ చర్యలు తీసుకుంటుంది. మైండ్‌ట్రీ షేర్ల నుంచి రూ.3,200 కోట్లు పొందారు. అందుకు చెల్లించాల్సిన పన్ను రూ.300 కోట్లకు బదులు రూ.46 కోట్లు చెల్లించారు. ఇంకో విషయమేమిటంటే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సిద్ధార్థ లేఖలో ఉన్న సంతకం గత రికార్డులతో సరిపోలట్లేదు."
- ఐటీ అధికారి