సైన్యం హిట్‌లిస్ట్‌లో 10 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లోయలో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించేందుకు సైన్యం సిద్ధమవుతోంది. నిఘా విభాగాలు, పారా మిలటరీ దళాలు, సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదుల జాబితాను తయారు చేసినట్లు తెలుస్తోంది.
హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ రియాజ్ అహ్మద్ నైకూ సహా 10 మంది మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదుల జాబితాను భద్రతాదళాలు సిద్ధం చేశాయి. ఈ ఉగ్ర మూకలను పట్టుకోవటం లేదా హతమార్చటమే లక్ష్యంగా త్వరలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టనున్నాయి.
నైకూ పేరు ఈ జాబితాలో ముందుంది. సైనిక బలగాలు, పౌరుల ప్రాణనష్టానికి కారణమైన దాడులకు నైకూ సూత్రధారిగా వ్యవహరించినట్లు అధికారులు పేర్కొన్నారు.
లష్కరే తొయిబా షోపియాన్ జిల్లా కమాండర్ వసీం అహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ అనంతనాగ్‌జిల్లా కమాండర్ మహ్మద్ అష్రఫ్ ఖాన్, బారాముల్లా జిల్లా కమాండర్ మహ్రాజుద్దీన్, శ్రీనగర్‌లో హిజ్బుల్ ఆపరేటర్ సైఫుల్లా మీర్, పుల్వామా జిల్లా కమాండర్ అశ్రయిద్ ఉల్‌హక్, కశ్మీర్‌లోయలో జైషే చీఫ్ ఆపరేషనల్ కమాండర్, పాక్‌జాతీయుడు హఫీజ్ ఉమర్, అల్ బదర్ ఉగ్ర సంస్థ ఉత్తర కశ్మీర్ డివిజనల్ కమాండర్ జావెద్ మట్టూ, హిజ్బుల్ ముజాయిదీన్ ఉగ్రవాది ఆజాజ్ మాలిక్, జైషే ఉగ్రవాది జహిద్ షేక్ ఈ జాబితాలో ఉన్నారు.