తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను ఆ రాష్ట్ర ప్రజలు అమ్మగా పిలుచుకుంటారు. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెళ్లో చెరగని ముద్ర వేశారు. కోయంబత్తూర్ జిల్లా గణేషపురంలోని ఏఐఏడీఎమ్కే కార్యకర్తలు, గ్రామస్థులు అమ్మపై ఉన్న అభిమానాన్ని తమదైన శైలిలో చాటుకున్నారు. జయలలితకు గుడి కట్టి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు.
అభిమానం: జయలలితకు గుడి కట్టి.. నిత్య పూజలు - గణేష్పురం
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కోయంబత్తూరు జిల్లా గణేషపురంలో ఆలయం నిర్మించి పూజిస్తున్నారు అన్నాడీఎంకే కార్యకర్తలు, గ్రామస్థులు. తమ గ్రామానికి ఎంతో చేసిన అమ్మను తాము దైవంగా భావిస్తున్నామని చెబుతున్నారు.
'జయలలిత'కు గుడి కట్టిన అభిమానులు
గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో అమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 8 టన్నుల బరువున్న ఒకే రాయిపై ఈ శిల్పాన్ని చెక్కారు. జయలలిత చిత్రానికి ఒక పక్కన ఈటె, ఒక పక్కన గంట, పైన రెండు ఆకుల గుర్తు ఏర్పాటు చేశారు. రాయిపై ఇతర వైపుల కాలభైరవ, ఆంజనేయ స్వామి చిత్రాలతో పాటు 12 రాశులను చెక్కారు. విగ్రహ తయారీకి సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.
Last Updated : Jul 21, 2019, 10:21 AM IST