దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకు కొత్త కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, దిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 5.85 లక్షలు దాటింది. మరణాలు 17,400కు చేరాయి.
మహారాష్ట్రలో..
మహారాష్ట్రలో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 5,537 మందికి వైరస్ సోకింది. మరో 198 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,80,298కి చేరింది. ఇప్పటి వరకు 93,154 మంది వైరస్ కోలుకున్నారు. 79,075 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 8053కు చేరింది.
తమిళనాడులో...
తమిళనాడులో బుధవారం ఒక్కరోజే 3,882 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 63 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 94,049కి చేరగా.. మరణాలు 1,264కు చేరాయి. ఇప్పటి వరకు 52,926 మంది కోలుకున్నారు. 39,856 మంది చికిత్స పొందుతున్నారు.
దిల్లీలో...
దేశ రాజధాని దిల్లీలో వైరస్ కాస్త తగ్గుముఖం పట్టింది. బుధవారం 2,442 కొత్త కేసులు బయటపడ్డాయి. మరో 61 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 89,802, మరణాలు 2,803కు చేరాయి. ఇప్పటి వరకు 59,992 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 27,007 మంది చికిత్స పొందుతున్నారు.
కర్ణాటకలో...