తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడు తిరునెల్వెలిలో ఎన్​ఐఏ సోదాలు - తనిఖీలు

శనివారం ఉదయం తమిళనాడు తిరునెల్వెలి జిల్లాలోని రెండు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ). అన్సరుల్లా ఉగ్రసంస్థకు​ చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుంది.

తమిళనాడు తిరునెల్వెలిలో ఎన్​ఐఏ సోదాలు

By

Published : Sep 21, 2019, 2:46 PM IST

Updated : Oct 1, 2019, 11:22 AM IST

తమిళనాడు తిరునెల్వెలిలో ఎన్​ఐఏ సోదాలు

తమిళనాడులో తిరునెల్వెలి జిల్లాలోని రెండు ప్రాంతాల్లో శనివారం విస్తృత సోదాలు చేపట్టింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ). ఐఎస్​ఐఎస్​ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉగ్రకార్యకలాపాలు సాగుతున్నాయన్న ఆరోపణలతో తనిఖీలు చేపట్టినట్లు కొచ్చికి చెందిన ఐదుగురు సభ్యుల బృందం తెలిపింది.

ఉదయం 7 గంటల సమయంలో నగరంలో సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ.. అన్సరుల్లా ఉగ్రసంస్థకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది.

గతంలోనూ..

జులై నెలలో అన్సరుల్లా ఉగ్రసంస్థ కేసు విచారణలో భాగంగా తమిళనాడులోని సుమారు 10 ప్రాంతాల్లో ఎన్​ఐఏ సోదాలు చేపట్టింది. చెన్నై, మదురై, తిరునెల్వెలి, రామనాథపురం జిల్లాలకు చెందిన 16 మందిని అరెస్ట్​ చేసింది. వీరంతా అల్​ఖైదాకు మద్దతిస్తున్నారని పేర్కొంది.

Last Updated : Oct 1, 2019, 11:22 AM IST

ABOUT THE AUTHOR

...view details