తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్​ను జూన్​ 30 వరకు పొడిగించిన తమిళ సర్కార్​​ - tamilnadu government extension lockdown

జూన్​ 30వరకు లాక్​డౌన్​ పొడిగించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అయితే కొన్నింటికి సడలింపులు ఇస్తున్నట్లు వెల్లడించింది. ప్రజారవాణా పాక్షికంగా ప్రారంభిస్తామని.. కరోనా వైరస్​ కేసులు అత్యధికంగా నమోదవుతున్న జిల్లాల్లో బస్సులు నడపబోమని స్పష్టం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి.

Tamil Nadu extends coronavirus lockdown till June 30, allows partial resumption of public transport
లాక్​డౌన్​ను జూన్​ 30 వరకు పొడిగించిన తమిళ సర్కార్​​

By

Published : May 31, 2020, 11:32 AM IST

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా తమిళ సర్కార్ చర్యలు చేపట్టింది. తమిళనాడులో జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి పళనిస్వామి స్పష్టం చేశారు. అన్ని జిల్లాలను 8 జోన్లుగా విభజించనున్నట్లు ప్రకటించిన ఆయన.. ప్రయాణాలకు ఇకపై "ఈ-పాస్‌"లు అవసరం లేదని స్పష్టంచేశారు. అంతరాష్ట్ర బస్సుల రవాణా, మెట్రో రైళ్లు, సుబర్బన్​ రైళ్లు, ప్రార్థన స్థలాలపై ఆంక్షలు కొనసాగిస్తామని వెల్లడించారు.

అయితే జూన్​ 1 నుంచి రాష్ట్రంలో తక్కువ సేవలతో ప్రజా రవాణా ప్రారంభిస్తామని చెప్పారు పళనిస్వామి. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్​, చెంగల్​పట్టు జిల్లాల్లో బస్సులకు అనుమతించబోమని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి.

ఐటీ సంస్థలు, ఐటీ ఆధారిత సేవలందించే కంపెనీలు.. 20శాతం అంటే 40 మందికి మించకుండా ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

దేశంలో అత్యధికంగా కొవిడ్​-19 కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానం ఉంది. శనివారం ఒక్కరోజే 938 కొత్త కేసులు నమోదు కావడం వల్ల రాష్ట్రంలో మొత్తం వైరస్​ బాధితుల సంఖ్య 21,184 చేరింది.

ఇదీ చూడండి:'మై లైఫ్.. మై యోగా' బ్లాగ్ ద్వారా యోగా పోటీలు:మోదీ

ABOUT THE AUTHOR

...view details