తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మౌత్ ఆర్గాన్' వాయించటంలో ఈ గజరాజు దిట్ట

తమిళనాడు తెక్కంపట్టిలో గజరాజుల కోసం నిర్వహించిన ప్రత్యేక క్యాంపులో ఓ ఏనుగు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మౌత్​ ఆర్గాన్​ వాయిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఏనుగు సంగీత సాధనపై మరిన్ని విశేషాలు మీకోసం...

elephant plays mouth organ
'మౌత్ ఆర్గాన్' వాయించటంలో ఈ గజరాజు దిట్ట

By

Published : Jan 29, 2020, 3:25 PM IST

Updated : Feb 28, 2020, 10:03 AM IST

'మౌత్ ఆర్గాన్' వాయించటంలో ఈ గజరాజు దిట్ట

ఆలయాల్లోని ఏనుగుల సంరక్షణ కోసం తమిళనాడు ప్రభుత్వం ఏటా ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తుంది. ఈసారి కోయంబత్తూర్​లోని తెక్కంపట్టిలో ఏర్పాటు చేసిన శిబిరంలో ఆండాల్​ అనే ఏనుగు ప్రత్యేక ఆకరర్షణగా నిలిచింది. సంగీత వాయిద్యం 'మౌత్​ ఆర్గాన్'​ వాయిస్తూ ఆకట్టుకుంది. ఫుట్​బాల్​ కూడా చక్కగా ఆడుతోంది.

శ్రీరంగం ఆలయంలో ఉండే ఈ గజరాజుకు రాజేశ్​ అనే వ్యక్తి శిక్షణ ఇస్తున్నాడు. ఆండాల్​ చెప్పిన పనిని కాదనకుండా చేసేస్తుందని అంటున్నాడు.

"ఆండాల్​ చాలా సున్నితమైనది. మౌత్​ ఆర్గాన్​ను చాలా బాగా వాయిస్తుంది. మీరు అరటి పండు ఇస్తే దాని తొక్క తీసి తింటుంది. శ్రీరంగం ఆలయంలో తన విధులు నిర్వర్తించేందుకు నిరాకరించదు."

- రాజేశ్​.

ఏడాదికి ఒకసారి ఇలాంటి క్యాంపులు నిర్వహించటం ద్వారా ఏనుగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు వాటి సంరక్షకులు. వివిధ ఆలయాల నుంచి వచ్చే ఏనుగులతో వాటికి బంధం ఏర్పడి ఉల్లాసంగా ఉంటాయని అంటున్నారు.

2003 నుంచి..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆలయాల్లోని గజరాజులను సంరక్షించేందుకు పునరుత్తేజనం పేరిట 2003లో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఏటా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో గజరాజులకు పౌష్టికాహారం, వైద్యం అందిస్తారు.

ఇదీ చూడండి: ట్రాన్స్​జెండర్ల ఐకమత్యం- రూ.కోటితో భవన నిర్మాణం

Last Updated : Feb 28, 2020, 10:03 AM IST

ABOUT THE AUTHOR

...view details