తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భుట్టో' బుట్టలో పడిపోయాం: నట్వర్​ సింగ్ - రహస్యాలు

1972లో భారత్​-పాకిస్థాన్​  మధ్య 'సిమ్లా ఒప్పందం' జరిగింది. ఈ ఒప్పందానికి జులై 2తో 47 ఏళ్లు పూర్తవుతాయి. ఆ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి సలహాదారుల్లో ఒకరిగా పనిచేసిన కేంద్ర మాజీమంత్రి నట్వర్​ సింగ్ సిమ్లా ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

'భుట్టో' బుట్టలో పడిపోయాం: నట్వర్​ సింగ్

By

Published : Jul 1, 2019, 3:34 PM IST

Updated : Jul 1, 2019, 3:50 PM IST

1972లో 'సిమ్లా ఒప్పందం' కుదిరింది. జులై 2తో ఈ ఒప్పందానికి 47 ఏళ్లు. అయితే ఈ ఒప్పందంలో పాక్​ డిమాండ్లకు భారత్​ తలొగ్గిందని ఇప్పటికీ విమర్శలు వినిపిస్తాయి. డిమాండ్​ చేసే స్థానంలో ఉన్న భారత్​ ఎందుకు పాక్​కు లొంగాల్సి వచ్చింది? ఈ ఒప్పందంలో జరిగిన రహస్యాలు ఏంటి? ఆ సమయంలో ప్రధాని ఇందిరాగాంధీ సలహాదారుల్లో ఒకరిగా ఉన్న నట్వర్​ సింగ్​ ఈ విషయాలపై ఈటీవీ భారత్​ ముఖాముఖిలో కీలక వ్యాఖ్యలు చేశారు.

1971లో భారత్​-పాక్ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాకిస్థాన్​ సైన్యాన్ని భారత్​ సమర్థంగా ఎదుర్కొంది. పాక్​ సేనలు నలువైపులా చుట్టుముట్టినా... భారత్​ సైన్యం ధాటికి దాయాదులు వెనుదిరగక తప్పలేదు. ఆ యుద్ధంలో 93,000 మంది పాక్​ సైనికులను భారత్​ బంధించింది. ​ పశ్చిమ పాకిస్థాన్​ భూభాగంలోని దాదాపు 5000 చదరపు మైళ్ల స్థలాన్ని భారత సైన్యం ఆక్రమించింది.

1972లో అప్పటి భారత్​, పాక్​ ప్రధానులు ఇందిరాగాంధీ, అలీ భుట్టో సిమ్లాలో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య శాంతి స్థాపనకోసం భారత్​, పాక్​ ఓ ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందంలో భాగంగా భారత్​ తాను ఆక్రమించిన పాక్​ భూభాగాన్ని సహృద్భావ చర్యగా వారికి అప్పగించింది. మన చేతిలో బందీలుగా ఉన్న 93,000 మంది పాక్​ సైనికులను విడిచిపెట్టింది.

దాయాదుల డిమాండ్లకు ఇందిరా గాంధీ ఇంతగా ఎందుకు లొంగాల్సి వచ్చిందనే సందేహంపై, ఒప్పందంపై నట్వర్ సింగ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి కేంద్రమంత్రులు, హోంమంత్రి ఇందిరాగాంధీకి పలు సలహాలు ఇచ్చినప్పటికీ ఆమె తనకు ఇష్టమైన సలహాదారు అక్సర్​ చెప్పిన మాటే విన్నారని నట్వర్​ తెలిపారు.

కేంద్ర మాజీమంత్రి నట్వర్​ సింగ్

"భుట్టో, ఇందిరా గాంధీ సిమ్లాలో భేటీ అయ్యారు. చాలా సార్లు ఇరువురు ఏకాభిప్రాయానికి రాలేదు. అయితే చివరి భేటీ సఫలమైంది. ఒప్పందం కుదిరింది. చారిత్రక కోణంలో ఈ ఒప్పందాన్ని గమనిస్తే... మనం పాక్​కు చాలా ఇచ్చేశాం. 5,600 చ.మై భూభాగాన్ని ఇచ్చేశాం. మనం బంధించిన 93,000 మంది పాక్​ సైన్యాన్ని విడుదల చేశాం. భుట్టో మమ్మల్ని మాయ చేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఖాళీ చేతులతో వెళ్తే నా ప్రభుత్వం పడిపోతుంది అని భుట్టో అన్నారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి."
- నట్వర్​ సింగ్, కేంద్ర మాజీ మంత్రి

Last Updated : Jul 1, 2019, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details