మార్చి నెలలో దిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ కారణంగానే దేశంలో ఎక్కువ మందికి కరోనా సోకినట్లు రాజ్యసభలో తెలిపింది కేంద్ర హోంశాఖ. ఈ మేరకు రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు.. సమాధానమిచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
అయితే.. ఇప్పటివరకు 233 తబ్లిగీ జమాత్ సభ్యులను అరెస్టు చేసినట్లు మంత్రి తెలిపారు. మార్చి 29 నుంచి ఆ సంస్థ ప్రధాన ప్రాంగణం నుంచి 2,361 మందిని బయటకు తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. జమాత్ అధ్యక్షుడు మౌలానా మొహ్మద్ సాద్‌పై దర్యాప్తు సాగుతోందన్నారు.