హరియాణాలోని మేవాత్. ఇక్కడి నుంచి దిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌కు వంద కిలోమీటర్లు. నూహ్, పల్‌వల్ జిల్లాలు కలిసుండే ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా 7%. తబ్లీజీ జమాత్ నిమిత్తం కొద్దిరోజుల కిందట ఇక్కడి నుంచి నిజాముద్దీన్‌కు నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించారు. వీరిలో కొంతమంది వైరస్ వాహకులు (సూపర్ స్ప్రెడర్లు)గా మారడం వల్ల... మేవాత్ ఇప్పుడు రాష్ట్రంలో వైరస్ కేంద్రంగా మారింది.
నిజాముద్దీన్‌కు వంద కిలోమీటర్ల దూరంలో 'సూపర్ స్ప్రెడర్లు' - నిజాముద్దీన్ మర్కజ్
నిజాముద్దీన్ ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. ఈ ప్రదేశానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న హరియాణా మేవాత్ ప్రాంతానికి చెందిన ముస్లీం రాకపోకలు జరిగాయి. ఫలితంగా ఈ ప్రాంతం ఆ రాష్ట్రంలో వైరస్ కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ రోజురోజుకు కేసులు పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
మర్కజ్‌కు వెళ్లొచ్చినవారిలో మొత్తం 1,205 మందిని అధికారులు పర్యవేక్షణలో ఉంచారు. కొద్దిరోజుల తర్వాత కొంతమందిపై నిఘా సడలించినా, ప్రస్తుతం 1,145 మంది ఆరోగ్యాన్ని నిశితంగా గమనిస్తున్నారు. వీరిలో ఇప్పటివరకూ 355 మంది నమూనాలను పరీక్షించగా, ఏప్రిల్ 7 నాటికి 37 మందికి కరోనా సోకినట్టు తేలింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు శ్రీలంక(6), దక్షిణాఫ్రికా(1), ఇండోనేసియా(1), థాయ్‌లాండ్(1) దేశీయులూ ఇందులో ఉన్నారు. విచిత్రమేంటంటే... 37 మంది బాధితుల్లో ఒక్క వ్యక్తి మాత్రమే స్థానికుడు మిగతా 36 మంది ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందినవారేనని నూహ్ డిప్యూటీ కమిషనర్ పంకజ్‌యాదవ్ తెలిపారు. పరిస్థితి దృష్ట్యా జిల్లాలోని 36 గ్రామాలను కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించారు. ఇక్కడ నమోదైన కేసులన్నీ జమాత్‌తో సంబంధమున్నవేనని అసిస్టెంట్ సివిల్ సర్జన్ డా.అరవింద్ చెప్పారు.