తెలంగాణ

telangana

By

Published : Oct 8, 2020, 3:45 PM IST

ETV Bharat / bharat

వాక్​ స్వతంత్రం దుర్వినియోగంపై సుప్రీం ఆందోళన

ఇటీవల కాలంలో వాక్ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అత్యంత దుర్వినియోగానికి గురైన హక్కులుగా మారాయని పేర్కొంది సుప్రీం. తబ్లిగీ కేసులో మీడియా విద్వేషాలు రెచ్చగొట్టేలా కథనాలు ప్రసారం చేసిందని మండిపడింది. ఆ వార్తలను అదుపు చేసేందుకు తీసుకున్న చర్యలపై సమాచార మంత్రిత్వ శాఖ సరైన వివరణ ఇవ్వలేదని అహనం వ్యక్తంచేసింది.

Tablighi case: Freedom of speech & expression most abused right in recent times, says SC
'తబ్లిగీ కేసులో.. స్వేచ్ఛా దుర్వినియోగం చేసిన మీడియా'

తబ్లిగీ కేసులో వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ దుర్వినియోగమయ్యాయని ఆవేదన వ్యక్తంచేసింది సుప్రీంకోర్టు. సమాజంలో విద్వేషాన్ని ప్రేరేపించేలా మీడియా కథనాలు ప్రసారం చేయడంపై మండిపడింది.

ఓ వర్గానికి చెందిన మీడియా అనవసరంగా విద్వేషాలను ప్రేరేపిస్తోందని ఆరోపిస్తూ.. జమియాత్ ఉలమా-ఐ-హింద్ దాఖలు చేసిన పిటిషన్​ను విచారించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం. తబ్లిగీ వార్తలను మత కల్లోలాలకు దారితీసే విధంగా ప్రసారం చేసిన మీడియాపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మధ్య భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత దుర్వినిగానికి గురవుతున్న హక్కుగా మారిందని పేర్కొంది.

ఇలాంటి కేసుల్లో అనుచిత మీడియా ప్రసారాలను ఆపడానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యల వివరాలను కోరింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి సమాచార మంత్రిత్వ శాఖ కార్యదర్శి కాక.. అదనపు కార్యదర్శి సమర్పించిన అఫిడవిట్ పై అంతృప్తి వ్యక్తం చేసింది. అఫిడవిట్ లో అనవసరపు వివరణే ఎక్కువుందని పేర్కొంది.

ఇదీ చదవండి:17 మంది విదేశీ తబ్లిగీ జమాత్ సభ్యులు విడుదల

ABOUT THE AUTHOR

...view details