తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎన్​ఆర్​ఐ'లకు తప్పనున్న ఆధార్​ ఇక్కట్లు - హిసార్​

ప్రవాస భారతీయులు ఇక ఆధార్ ​కార్డు కోసం నెలలతరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. పాస్​పోర్టు ఉన్న ఎన్​ఆర్​ఐలు అందరికీ కొద్ది రోజుల్లోనే ఆధార్​ మంజూరు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు యూఐడీఏఐ ప్రకటించింది.

'ఎన్​ఆర్​ఐ'లకు తప్పనున్న ఆధార్​ ఇక్కట్లు

By

Published : Sep 1, 2019, 6:59 PM IST

Updated : Sep 29, 2019, 2:17 AM IST

ప్రవాస భారతీయులకు ఇకపై 'ఆధార్'​ ఇక్కట్లు తప్పనున్నాయి. మూడు నెలలలోపే ఆధార్​కార్డు జారీ చేసే విధానం తీసుకొస్తున్నట్లు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) తెలిపింది.

ప్రస్తుత విధానంలో ఎన్​ఆర్​ఐలు దరఖాస్తు చేసుకున్నాక కనీసం 180 రోజులకు కానీ ఆధార్​ రాదు. ఈ పద్ధతిని మార్చనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్​ సందర్భంగా ప్రకటించారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు యూఐడీఏఐ సీఈఓ అజయ్​ భూషణ్​ పాండే. ఇందుకోసం అవసరమైన సాంకేతిక మార్పులు చేస్తున్నట్లు వివరించారు.

అపాయింట్​మెంట్​ సదుపాయం

"కొత్త విధానంలో ఎన్​ఆర్​ఐలు విదేశాల్లో ఉండగానే ఆధార్​ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ సమయంలో, ఎక్కడ ఆధార్​ కార్డ్ తీసుకోవాలో వారే నిర్ణయించుకోవచ్చు. భారత్​కు వచ్చిన వెంటనే సంబంధిత​ కేంద్రానికి వెళ్లి ఆధార్​ను పొందవచ్చు" అని చెప్పారు పాండే.

దేశవ్యాప్తంగా కేంద్రాల ఏర్పాటు

పాస్​పోర్ట్​ సేవా కేంద్రాల తరహాలో దేశవ్యాప్తంగా 53 నగరాల్లో 114 ఆధార్​ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది యూఐడీఏఐ. ఆధార్​ కోసం కొత్తగా నమోదు, ఉన్నవాటిలో మార్పులు వంటివి ఇక్కడ చేసుకోవచ్చు. ఇప్పటికే ఆధార్​ సంబంధిత సేవలు అందిస్తున్న బ్యాంకులు, తపాలా కార్యాలయాలకు ఇవి అదనం.

ఇదీ చూడండి:రాహుల్​ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు సిగ్గుపడాలి: షా

Last Updated : Sep 29, 2019, 2:17 AM IST

ABOUT THE AUTHOR

...view details