తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్మగ్లింగ్​ కేసు: కేరళకు బంగారు కి'లేడీ'

బంగారం స్మగ్లింగ్​ కేసులో నిందితులైన స్వప్నా సురేశ్​​, సందీప్​ను బెంగళూరు నుంచి కేరళకు తీసుకువచ్చారు పోలీసులు. వీరిని వైద్య పరీక్షల నిమిత్తం ఎర్నాకులంలోని అలువా ఆసుపత్రికి తరలించారు.

Swapna, Sandeep brought to NRI office in Kochi; protesters driven away by police
స్మగ్లింగ్​ కేసు: బెంగళూరు నుంచి కేరళకు బంగారు కి'లేడీ'

By

Published : Jul 12, 2020, 4:39 PM IST

కేరళలో సంచలనం సృష్టించిన బంగారం స్మగ్లింగ్​ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్నా సురేశ్​, మరో నిందితుడు సందీప్​ను బెంగళూరు నుంచి కేరళకు తిరిగి తీసుకువచ్చారు అధికారులు. వీరిని కొచ్చిలోని ఎన్​ఐఏ కోర్టులో హాజరుపరిచే ముందు కరోనా పరీక్షల నిమిత్తం ఎర్నాకులంలోని అలువా ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రికి తీసుకువస్తున్నట్లు తెలుసుకున్న కాంగ్రెస్​, భాజపా కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో లాక్​డౌన్ ఆంక్షలు అమలు అవుతున్న తరుణంలో నిందితులిద్దరూ కేరళ దాటి ఎలా వెళ్లారో ప్రభుత్వం సమాధానమివ్వాలని డిమాండ్​ చేశారు.

ఇదీ కేసు...

ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన కేరళలోని ఆ దేశ కాన్సులేట్​కు వచ్చిన పార్సిల్​లో దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. యూఏఈ కాన్సులేట్‌ మాజీ ఉద్యోగి అయిన సరిత్‌ అనే వ్యక్తి వద్ద నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరిత్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు సాగించారు. తర్వాత ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్​ఐఏ అధికారులు... శనివారం బెంగళూరులో స్వప్న, సందీప్​ను అరెస్టు చేశారు.

ఇదీ చూడండి:కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం

ABOUT THE AUTHOR

...view details