ఒకేరోజు 7 బిల్లులు ఆమోదం..
రాజ్యసభలో మంగళవారం మూడున్నర గంటల్లోనే 7 కీలక బిల్లులకు ఆమోదం లభించింది. నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు సహా.. మొత్తం 7 బిల్లులను ఆమోదించింది పెద్దల సభ.
16:40 September 22
ఒకేరోజు 7 బిల్లులు ఆమోదం..
రాజ్యసభలో మంగళవారం మూడున్నర గంటల్లోనే 7 కీలక బిల్లులకు ఆమోదం లభించింది. నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు సహా.. మొత్తం 7 బిల్లులను ఆమోదించింది పెద్దల సభ.
14:14 September 22
2020 ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీనితో కలిపి మొత్తం ఈ రోజు ఆరు కీలక బిల్లులకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది.
13:41 September 22
2020 జాతీయ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ బిల్లును పెద్దల సభ ఆమోదించింది. దీనితో కలిపి ఈ రోజు మొత్తం ఐదు కీలక బిల్లులకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది.
12:24 September 22
వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులో నిత్యావసర వస్తువుల సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉల్లిపాయ, బంగాళాదుంపలు వంటి ఉత్పత్తులను నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగించాలని సవరించిన ఈ చట్టం చెబుతుంది. యుద్ధం, కరువు లాంటి పరిస్థితుల్లో ఈ వస్తువులపై పరిమితులు ఎత్తివేయాలని నిర్దేశిస్తుంది.
కొత్తగా స్థాపించబడిన ఐదు ఐఐఐటీలను జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థలుగా ప్రకటించే బిల్లును కూడా పార్లమెంటు ఆమోదించింది.
11:26 September 22
ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు.. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయనీయకుండా మరో బిల్లును తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్. స్వామినాథన్ సిద్ధాంతాన్ని అనుసరించి కనీస మద్దతు ధరను ఎప్పటికప్పుడు నిర్ణయించాలని కోరారు. వీటితో పాటు 8 మంది MP లపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ మూడు డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించే వరకు రాజ్యసభ సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు
10:48 September 22
10:43 September 22
పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాలనే ఆలోచనను విపక్ష సభ్యులు విరమించుకోవాలని కోరారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు. సభలోకి వచ్చి చర్చలో పాల్గొనాలని సూచించారు.
10:16 September 22
10:09 September 22
8 ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సభ నుంచి వాకౌట్ చేసి పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు విపక్ష సభ్యులు.
10:06 September 22
10:02 September 22
వ్యవసాయ బిల్లుల విషయంలో విపక్ష సభ్యులు అనుచితంగా ప్రవర్తించారంటూ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ఒకరోజు నిరాహార దీక్షకు దిగారు.
09:52 September 22
ఒకే రోజు నాలుగు కీలక బిల్లులకు రాజ్యసభ ఆమోదం
రాజ్యసభలో 8 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కనీస మద్దతు ధరకు సంబంధించి మరో బిల్లు తీసుకురావాలని ఆ పార్టీ నేత గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. లేకపోతే పార్లమెంటు సమావేశాలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.
TAGGED:
live page