ఆర్టికల్-370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. అన్నిపక్షాల వాదనలు విన్న జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి, జస్టిస్ బిఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం నవంబర్ 27న తీర్పు రిజర్వు చేసింది.
కశ్మీర్లో ఆంక్షల పిటిషన్లపై నేడు సుప్రీం తీర్పు - SC verdicts
జమ్ముకశ్మీర్లో ఆంక్షలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు తీర్పు వెలువరించనుంది సుప్రీంకోర్టు. అన్ని పక్షాల వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం గతేడాది నవంబరు 27న తీర్పును ఈరోజుకు వాయిదా వేసింది.
కశ్మీర్లో ఆంక్షల పిటిషన్లపై నేడు సుప్రీం తీర్పు
విచారణ సందర్భంగా ఆంక్షలను సమర్థించుకున్న కేంద్రం... ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆంక్షల వల్ల ఒక్క బుల్లెట్ పేలలేదని, ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదని వెల్లడించింది. ఆజాద్, కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ సహా మరికొందరు ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
ఇదీ చూడండి: 'దేశంలో రోజుకు సగటున 80 హత్యలు, 91 రేప్‌లు'
Last Updated : Jan 10, 2020, 10:15 AM IST