త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 50శాతం ఓటింగ్ యంత్రాల వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని విపక్షాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి.
ఈ పిటిషన్పై స్పందించిన ఈసీ... ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి ఒక్కో వీవీప్యాట్ ఓటింగ్ యంత్రంలోని రసీదులను లెక్కించే ప్రస్తుత పద్ధతే సరైనదని అఫిడవిట్లో పేర్కొంది. ప్రస్తుత విధానాన్ని మార్చడానికి తగిన కారణాలను విపక్ష పార్టీల నేతలు చూపలేకపోయారని కోర్టుకు వివరించింది.