కళాశాలలు, వర్సటీల చివరి సంవతర్సం పరీక్షల నిర్వహణపై తీర్పు వెలువరించింది సుప్రీం కోర్టు. సెప్టెంబర్ 30 లోపు పరీక్షలు నిర్వహించకుండా రాష్ట్రాలు, వర్సటీలు విద్యార్థులను ప్రమోట్ చేయొద్దని స్పష్టం చేసింది.
ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలన్న యూనియన్ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయాన్ని సమర్థించింది జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసం. ఏదైన రాష్ట్రం పరీక్షలు నిర్వహించేందుకు ఇబ్బందులు ఉంటే.. గడువు పెంచాలని యూజీసీని సంప్రదించాలని సూచించింది.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరణంలో పరీక్షలు నిర్వహించాలని యూజీసీ నిర్ణయించటాన్ని సవాల్ చేస్తూ.. శివసేన యూత్ వింగ్ యువ సేనాతో పాటు పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ప్రమాణాలపై ప్రభావం..
సెప్టెంబర్ 30లోపు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది యూజీసీ. జులై 6న మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు పలు నిపుణుల సిఫారుసుల ఆధారంగా రుపొందించామని ఇప్పటికే స్పష్టం చేసింది. పరీక్షలు నిర్వహించలేమని చెప్పటం తప్పని పేర్కొంది. ఫైనల్ ఇయర్ పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించిన మహారాష్ట్ర, దిల్లీ ప్రభుత్వాల నిర్ణయాలు సరికాదని తెలిపింది. అలాంటి నిర్ణయం ఉన్నత విద్యా ప్రమాణాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.