తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ, షాపై వ్యాజ్యం​- ఈసీకి సుప్రీం నోటీసులు - సుప్రీంకోర్టు

మోదీ, అమిత్​షా ఎన్నికల నిబంధనావళి​ ఉల్లంఘించారన్న పిటిషన్​ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ వ్యాజ్యంపై వివరణ ఇవ్వాలని ఈసీకి నోటీసులు అందించింది.

మోదీ, షాపై వ్యాజ్యం​- ఈసీకి సుప్రీం నోటీసులు

By

Published : Apr 30, 2019, 4:58 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​ షా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న పిటిషన్​పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. అగ్ర నేతలు ఇద్దరూ ప్రచారాల్లో ఎన్నికల కోడ్​ను ఉల్లంఘించినప్పటికీ ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని కాంగ్రెస్​ ఎంపీ సుశ్మితా దేవ్​ సోమవారం వ్యాజ్యం​ దాఖలు చేశారు. ఈ విషయంపై స్పందించాలని ఎన్నికల సంఘాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

సుశ్మితా దేవ్​ ఫిర్యాదుపై చర్యలు చేపట్టేందుకు ఈసీకి పూర్తి స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: 'ధిక్కరణ'పై రాహుల్​కు సుప్రీం మరో అవకాశం

ABOUT THE AUTHOR

...view details