తెలంగాణ

telangana

ETV Bharat / bharat

న్యాయాన్ని కొనలేం, ఆలస్యం చేయలేం : సుప్రీం - నల్లధన చట్టం

2016లో అమలులోకి వచ్చిన 'నల్లధన చట్టం'.. 2015 జులై​ 1 నుంచి ఎలా వర్తిస్తుందన్న గౌతమ్​ ఖైతాన్​ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. తమ స్పందనకు మరో నాలుగు వారాలు గడువు కావాలని ఖైతాన్​ తరఫు న్యాయవాది కోరినందున.. కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 17లోగా తమ స్పందన సమర్పించాలని ఆదేశించింది. వాదనలు 18వ తేదీన వింటామని స్పష్టం చేసింది.

న్యాయాన్ని కొనలేం, ఆలస్యం చేయలేం : సుప్రీం

By

Published : Sep 11, 2019, 10:14 PM IST

Updated : Sep 30, 2019, 6:57 AM IST

వీవీఐపీ హెలీకాఫ్టర్ల స్కామ్​లో నిందితుడైన గౌతమ్​ ఖైతాన్..​ నల్లధన చట్టం-2016కు సంబంధించి చేసిన అప్పీల్​పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ స్పందనకు మరో నాలుగు వారాలు గడువు కావాలని ఖైతాన్​ తరఫు న్యాయవాది కోరినందున.. కేసు విచారణలో జాప్యం చేస్తూ ధర్మాసనాన్ని పక్కనపెట్టాలని చూస్తున్నారని మండిపడింది. సెప్టెంబర్​ 18న వాదనలు వింటామని.. 17లోగా తమ స్పందన తెలియజేయాలని స్పష్టం చేసింది. న్యాయాన్ని ఈ విధంగా కొనలేమని, ఆలస్యం చేయలేమని తెలిపింది. న్యాయవాద వృత్తిలో ఉన్న మీరు చట్టాన్ని రక్షించాలని ఖైతాన్​ తరఫు లాయర్​కు హితవు పలికింది.

" మీ ప్రయత్నం ఏమిటి, అది మాకు అర్థమైంది. మేం అందుకు విముఖంగా ఉన్నాం. మాట్లాడకండి. మేం ఎంతో ఆగ్రహంతో ఉన్నాం. ఇది సరైన మార్గం కాదు. ధర్మాసనాన్ని పక్కనపెట్టాలని చూస్తున్నారు. న్యాయం ఈ విధంగా ఆలస్యం కాకూడదు."

- సుప్రీంకోర్టు

దిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే...

2016లో అమలులోకి వచ్చిన 'నల్లధన చట్టం'.. 2015 జులై​ 1 నుంచి ఎలా వర్తిస్తుందన్న ఖైతాన్​ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. నల్లధన చట్టం-2016.. గతేడాది జులై కేసులకు వర్తించదని ఈ ఏడాది మేలో దిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. దిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది సుప్రీం.. కేంద్ర ప్రభుత్వం వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. అయితే విచారణలో ఖైతాన్​ తరఫు న్యాయవాది చేస్తున్న జాప్యానికి అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. మీరు కోర్టును ఆశ్రయిస్తున్న పద్ధతి సరైంది కాదని తెలిపింది.

న్యాయవాది క్షమాపణలు

సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినందున ఖైతాన్​ తరఫు న్యాయవాది ధర్మాసనానికి క్షమాపణలు చెప్పారు.

" మా స్పందన తెలియజేసేందుకు ఎంత సమయమైతే సరిపోతుందని కోర్టు భావిస్తే అంత గడువు ఇవ్వాలని మాత్రమే కోరుతున్నా."

- ఖైతాన్ తరఫు న్యాయవాది

ఇదీ చూడండి: 16 ఏళ్లకే ఇంగ్లీష్​ ఛానల్ ఈదేసిన భారతీయురాలు!

Last Updated : Sep 30, 2019, 6:57 AM IST

ABOUT THE AUTHOR

...view details